గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీ

|
Google Oneindia TeluguNews

రూల్ ఈజ్ రూల్ ... రూల్ ఫర్ ఆల్ అని కచ్చితంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇళ్లలో నుంచి రోడ్డుమీదికి వచ్చే వారెవరైనా సరే మాస్కులు ధరించి తీరాల్సిందే అని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు పోలీస్ శాఖలో అధికారులు సైతం మాస్క్ ధరించకుంటే జరిమానాలు సైతం విధిస్తూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

పోలీసులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని తేల్చి చెబుతున్న పోలీస్ బాస్ ఓ సిఐ పై ఫైన్ విధించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 గుంటూరు అర్బన్ ఎస్పీ స్పెషల్ డ్రైవ్ .. మాస్క్ ధరించని ట్రాఫిక్ సిఐ

గుంటూరు అర్బన్ ఎస్పీ స్పెషల్ డ్రైవ్ .. మాస్క్ ధరించని ట్రాఫిక్ సిఐ

అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి, ఎమ్ టి బి కూడలిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సిఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా వెళ్లడం గమనించిన ఎస్పీ అతన్ని ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదు అని ప్రశ్నించారు . అత్యవసరంగా విధుల్లో హాజరవడం కోసం వెళుతున్న క్రమంలో తాను మాస్కు మర్చిపోయానని సమాధానమిచ్చారు ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రావు.

 ఫైన్ వేసిన అర్బన్ ఎస్పీ .. రూల్స్ కి ఎవరూ అతీతులు కారు

ఫైన్ వేసిన అర్బన్ ఎస్పీ .. రూల్స్ కి ఎవరూ అతీతులు కారు

అయినప్పటికీ ఎస్పీ విధుల్లో పాల్గొంటున్న పోలీసులు కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని ,జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడమే కాకుండా, మాస్క్ మరిచిపోయి రోడ్డుమీదికి వచ్చినందుకు ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రావు కు ఫైన్ విధించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. అంతేకాదు వెంటనే మాస్కుతెప్పించి ఎస్పి స్వయంగా సీఐకి మాకు తగిలించారు. రూల్స్ పోలీసులకు కూడా వర్తిస్తాయని గుంటూరు అర్బన్ ఎస్పీ ట్రాఫిక్ సీఐ మధుసూదన్ రావుకు ఫైన్ విధించి మరీ తేల్చిచెప్పారు.

మాస్కులు ఇచ్చి , క్లాస్ పీకిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

మాస్కులు ఇచ్చి , క్లాస్ పీకిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి


ఇక స్పెషల్ డ్రైవ్ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మాస్క్ ధరించకుండా వెళుతున్న వాహనచోదకులు ,పాదచారులకు క్లాస్ పీకి మరీ పంపించారు. మాస్కులు తప్పనిసరని మాస్క్ ధరించకుండా కనిపిస్తే, ఫైన్ వేస్తామని చెప్పి మాస్కులు తెప్పించి మరీ వారికిచ్చి వారిలో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో పోలీసులు కఠినంగా కోవిడ్ రూల్స్ అమలుకు శ్రీకారం చుట్టారు.

దుకాణం దారులకు ఎస్పీ మార్క్ క్లాస్ .. కరోనా కట్టడికి అందరూ పని చెయ్యాలన్న ఎస్పీ

దుకాణం దారులకు ఎస్పీ మార్క్ క్లాస్ .. కరోనా కట్టడికి అందరూ పని చెయ్యాలన్న ఎస్పీ

అంతేకాదు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రాంతాలలో దుకాణదారులను పిలిచి మాస్కులు ధరించిన వారినే షాప్ లోకి అనుమతించాలని చెప్పారు. దుకాణాల్లో శానిటైజర్ లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. షాప్ లలో నలుగురు కంటే ఎక్కువ మందిని ఉంచకూడదని చెప్పిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కరోనా వైరస్ కు కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు .

English summary
A special drive was organized at Guntur Urban SP Ammireddy Lodge circle and MTB circle for those who were not wearing masks in the Guntur Urban area. The SP fined Tulluru Traffic CI who was going in that direction without a mask . Moreover, he put a mask and fined the traffic CI . With this the SP said Rule is the rule for anyone .. The police are also determined to follow the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X