జనసేనలో జోష్: 14న కీలక సభ: సక్సెస్ కోసం ఏకంగా డజను కమిటీలు
గుంటూరు: పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఈ నెల 14వ తేదీన ఆవిర్భావ సభను జరుపుకోనుంది. ఈ సభ కోసం వేదికను కూడా సిద్ధం చేసింది. దీన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం ఏకంగా 12 కమిటీలను నియమించింది. పార్టీలో ముందు నుంచీ పని చేస్తూ వస్తోన్న సీనియర్ నాయకులను ఆయా కమిటీల్లో నియమించింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది పార్టీ అగ్ర నాయకత్వం.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలో గల ఇప్పటంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యే నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యతను ఆయా కమిటీలు పర్యవేక్షిస్తాయి. మూడు లక్షల మందికి పైగా ఈ సభకు హాజరవుతారని జనసేన పార్టీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది.

జిల్లాల సమన్వయ కమిటీలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్, పెదపూడి విజయ్ కుమార్, జీ ఉదయ్ శ్రీనివాస్ సుందరపు విజయ్ కుమార్, వడ్రాణం మార్కండేయ బాబు ఉన్నారు. ఆహ్వాన కమిటీలో టీ శివశంకర్, చేగొండి సూర్యప్రకాష్, సయ్యద్ జిలానీ, బేతపూడి విజయ్ శేఖర్, డాక్టర్ ఎర్రంకి సూర్యారావు, పసుపులేటి శ్రీనివాస్‌కు స్థానం కల్పించారు. బొలిశెట్టి సత్యనారాయణ, ఈవన సాంబశివ ప్రతాప్, గంటా స్వరూప, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్‌లను లైజన్ కమిటీలో నియమించారు.
ట్రాన్స్‌పోర్ట్ కమిటీలో చిలకం మధుసూదన్ రెడ్డి, నాయబ్ కమాల్, బొలిశెట్టి శ్రీనివాస్, బండారు రవికాంత్, ఎం వెంకటేశ్వర రావు, ఇసుకపట్ల రవిబాబు ఉన్నారు. సభా ప్రాంగణ నిర్వహణ కమిటీలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కల్యాణం శివ శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, తిరుమలశెట్టి నరసింహారావు, దాసరి శివనాగేంద్ర ఉన్నారు. క్యాటరింగ్ కమిటీ, భద్రత నిర్వహణ కమిటీ, సాంస్కృతిక కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, వలంటీర్ల కమిటీ, మెడికల్ అసిస్టెన్స్ కమిటీలను అపాయింట్ చేసింది పార్టీ.












Click it and Unblock the Notifications