కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడు
మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్నాటి పులిగా పిలిచేవారని అన్నారు. ఆయనకు భయమంటే ఏమిటో తెలియదని చెప్పారు. అలాంటీ వ్యక్తి చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలోనే పలు కేసులతో కోడెలను వేధించారని అన్నారు. ముఖ్యంగా లక్ష రుపాయల ఫర్నిచర్ కోసం ఆయన కక్కుర్తి పడ్డారని వేధింపులకు గురి చేశారని అన్నారు. వేల కోట్ల రుపాయాల ఆరోపణలు ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నీతులు చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక కోడెలపై కేసులు పెట్టినప్పుడు తాను ఎంతో సముదాయించానని చెప్పారు. చలో పల్నాడుకు కూడ కోడెల వస్తానని చెప్పారని... అయితే తానే వద్దని చెప్పానని అన్నారు.
గుంటూరు జిల్లా నరసరావు పేట ఎస్ ఎస్ ఎన్ కళాశాలలో జరిగిన దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభలో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొన్నారు. కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన అనంతరం సభలో మాట్లాడుతూ కోడెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. pic.twitter.com/X55Kr1YbG1
— Telugu Desam Party (@JaiTDP) September 30, 2019

నరసరావుపేటలో కోడెల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు చంద్రబాబు నాయుడతో పాటు పలువురు టీడీపీ నేతలు సభకు హజరయ్యారు. ఈ సంధర్భంగా కొడెలతో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. కోడెల వైద్య వృత్తితోపాటు, రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నరసరావుపేట తోపాటు గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. అలాంటీ వ్యక్తిని ప్రభుత్వమే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిందని పుల్లారావు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications