గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019 : గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : History Of Guntur Constituency,Sitting MP,MP Performance Report | Oneindia

ఏపిలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ప్ర‌క టించిన త‌రువాత ప్ర‌ధాన రాజ‌ధాని భాగం గుంటూరు లోక్‌స‌భ పరిధిలోకి వ‌స్తుంది. ఇక‌, మిగిలిన ప్రాంతం విజ‌య‌వాడ పరిధిలోకి వెళ్లింది. రాజ‌ధాని ప‌ర‌ధిలోని ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంటూరు లోక్‌స‌భ స్థానంలో ఓట‌ర్ల తీర్పు వారి ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌డుతుంది. అందులో భాగంగా గుంటూరు లోక్‌స‌భ రాజ‌కీయ చ‌రిత్ర ప‌రిశీలిస్తే..

గుంటూరు లోక్‌స‌భ‌...

వ్యాపార‌..వాణిజ్య‌..విద్యా..వైద్య‌.. రాజ‌కీయ రంగాల‌కు ప్ర‌సిద్ది. అంత‌ర్జాతీయ స్థాయిలో ఇక్క‌డి వాణిజ్య పంట‌లైన పొగాకు..ప‌త్తి..మిర్చి కు మంచి డిమాం డ్ ఉంది. తొలి ప్ర‌యివేటు..ట్యుటోరి య‌ల్ కాలేజి ఉమ్మ‌డి ఆంధ్రాలో గుంటూ రు లోనే మొద‌లైంది. గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి కోస్తా జిల్లాల్లోనే ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అమెరికా లో వైద్య సేవ‌లు అందిస్తున్న పలువురు ప్ర‌ముఖ వైద్యులు గుంటూరు వైద్య క‌ళాశాల లో చ‌దువుకున్న వారే. ఇక‌, రాజ‌కీయంగా ఎన్టీ రంగా, కొత్త ర‌ఘురామ‌య్య లాంటి ప్ర‌ముఖ‌లు ఇక్క‌డి నుండే లోక్‌స‌భకు ఎంపిక‌య్యారు. ఇప్పుడు ఏపి రాజ‌ధాని గా ఉండ‌టంతో..ఈ లోక్‌స‌భ స్థానానికి మ‌రితం ప్రాధాన్య‌త పెరిగింది..

రైతులు..విద్యాధికులే ఎక్కువ‌..

గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అందులో గుంటూరు న‌గ‌రంలోని గుంటూరు తూర్పు, గుంటూరు ప‌శ్చిమ‌, తెనాలి, పొన్నూరు, ప్ర‌త్తిపాడు, తాడికొండ‌, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాలు. అందు లో గుంటూరు న‌గ‌రం మిన‌హా మిగిలిన ప్రాంతంలో రైతులు..మ‌హిళ‌లు విజేత‌ల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉన్నారు.

గుంటూరు లో 16 లక్ష‌ల ఓట‌ర్లు..

ఏడు అసెంబ్లీల క‌ల‌యిక గుంటూరు లోక్‌స‌భ స్థానం. ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం దాదాపు 1572016 పైగా ఓట‌ర్లు ఉన్నారు. అందులో మ‌హిళా ఓట‌ర్లు.. 7,98,989 కాగా, పురుష ఓట‌ర్లు..7,73,023.తాజాగా, రానున్న ఎన్నిక‌ల కోసం 1.35 ల‌క్ష‌ల మంది కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న వారు ఉన్న‌ట్లు అంచ‌నా. ఇక‌, ప్ర‌తీ సారి దాదాపు 70 నుండి 80 శాతం వ‌ర‌కు ఇక్క‌డ పోలింగ్ శాతం న‌మోద‌వుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హోరా హోరీగా సాగిన పోరులో 79 శాతం పోలింగ్ న‌మోదైంది.

Guntur Constituency

గుంటూరు లోక్‌స‌భ‌కు 16 సార్లు ఎన్నిక‌లు..

1952 లో ఏర్పాటైన గుంటూరు లోక్‌స‌భ స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో 12 సార్లు కాంగ్రెస్ అభ్య‌ర్ధులే గెలుపొందారు. మూడు సార్లు టిడిపి..నియోజ‌క‌వ‌ర్గ తొలి ఎన్నిక‌లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా ఎస్వీఎల్ న‌ర‌సింహం ఎన్నిక‌య్యారు. 1957 నుండి 1977 వ‌ర‌కు కాంగ్రెస్ నుండి కొత్త ర‌ఘురామ‌య్య వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చారు. ఆ త‌రువాత కాంగ్రెస్ (ఐ) అభ్య‌ర్ధిగా నిల‌బ‌డిన రైతు నాయ‌కుడు ఎన్జీ రంగా మూడు సార్లు గెలుపొందారు. అదే విధంగా .. ప్ర‌స్తుతం టిడిపి నుండి న‌ర్స‌రావుపేట ఎంపిగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్ నుండి నాలుగు సార్లు ఎంపీ గా గెలిచారు. ఇక‌, ఎన్టీ రంగా పై 1991 లో టిడిపి అభ్య‌ర్ధి లాల్ జాన్ భాషా సంచ‌ల‌న విజ‌యం సాధించారు. తిరిగి 1999 లో టిడిపి అభ్య‌ర్ధి వైవి రావు గెలుపొంద‌గా..2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు.

2014 లో మారిన స‌మీక‌ర‌ణాలు.
రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత గుంటూరు రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అప్ప‌టి దాకా కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టిడిపి లో చేరారు. ఆయ‌న న‌ర్స‌రావుపేట నుండి టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసి..గెలు పొందారు. దీంతో..చిత్తూరు జిల్లాకు చెందిన గ‌ళ్లా కుటుంబం గుంటూరు నుండి పోటీకి దిగింది. కాంగ్రెస్ నుండి టిడిపి లో చేరిన గల్లా అరుణ కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుండి టిడిపి అభ్య‌ర్ధిగా అనూహ్యంగా బ‌రిలో దిగారు. సినీ హీరో కృష్ణ అల్లుడు జ‌య‌దేవ్‌.

70 వేల మెజార్టీతో గ‌ల్లా గెలుపు..

2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్ 69, 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయ‌న‌కు 618417 ఓట్లు రాగా..ప్ర‌త్య‌ర్ధి వైసిపి అభ్య‌ర్ధి వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి కి 549306 ఓట్లు ద‌క్కాయి. ఇక‌, కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్న అభ్య‌ర్ధి అబ్దుల్ వాహిద్ కు 46818 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ల్లా జ‌య‌దేవ్ మెజార్టీ సాధించారు. తాడికొండ లో 6813, తెనాలి లో 19,759, మంగ‌ళ‌గిరిలో 5896, పొన్నూరు లో 6084, ప్ర‌త్తిపాడు లో 9382, గుంటూరు ప‌శ్చిమ లో 21051, గుంటూరు తూర్పు లో 784 ఓట్ల ఆధిక్య‌త వ‌చ్చింది. అయితే వీటిలో గుంటూరు ప‌శ్చిమ‌, మంగ‌ళ‌గిరి ల్లో వైసిపి ఎమ్మెల్యేలు గెల‌వ‌గా..మిగిలిన అయిదు నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి అభ్య‌ర్ధులు గెలుపొందారు.

సామాజిక స‌మీక‌ర‌ణాలే కీల‌కం..

గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో ఎవ‌రు అభ్య‌ర్దిని ఖ‌రారు చేయాల‌న్నా..ఎవ‌రు గెల‌వాల‌న్నా ఇక్క‌డి సామాజిక స‌మీక‌ణాలే కీల‌కం. ప్ర‌తీ సారి దాదాపు ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామ‌జిక వ‌ర్గానికి చెందిన వారినే ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు. కాంగ్రెస్ ..టిడిపి లో అదే స‌మీక‌ర‌ణాలు పాటించారు. టిడిపి నుండి ఒక్క సారి మైనార్టీ అభ్య‌ర్ధికి అవ‌కాశం ఇచ్చారు. తొలి సారి పోటీ చేసిన వైసిపి క‌మ్మేత‌ర అభ్యర్ధిని బ‌రిలోకి దించింది. ఇక‌, 2009 లో పున‌ర్విభ‌జ‌న త‌రువాత కాపు, రెడ్డి, బిసి, మైనార్టీ ఓటు బ్యాంకు బాగా పెరిగింది. దీంతో..సార్వ‌త్రిక ఎన్నిక ల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల‌కు అక్క‌డి స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా అభ్య‌ర్ధిని ఖ‌రారు చేస్తూ..లోక్‌స‌భ కు మాత్రం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే అవ‌కాశం ఇస్తున్నారు.

లోక‌ల్ గా కంటే..ఢిల్లీలోనే పేరొచ్చింది..

2014 లో గుంటూరు ఎంపిగా టిడిపి నుండి గెలుపొందిన గ‌ల్లా జ‌య‌దేవ్ కు స్థానికంగా కంటే..పార్ల‌మెంట్ లో నే పేరు సంపాదించారు. విదేశాల్లో చ‌ద‌వుకోవ‌టం..వ్యాపార రంగంలో రాణించ‌టం..ప‌రిచ‌యాలు ఆయ‌న‌కు జాతీయ స్థాయిలో క‌లిసొచ్చిన అంశాలు. స్థానికంగా ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌టం లేద‌నే అభిప్రాయం ఉంది. ఇక‌, పార్ల‌మెంట్ లో టిడిపి వాయిస్ వినిపించ‌టంతో గ‌ల్లా కు ఎక్కువ టిడిపి నాయ‌క‌త్వం ప్రాధాన్య‌త ఇచ్చింది. ఇక‌, కొంత కాలం క్రితం జ‌రిగిన అవిశ్వాస తీర్మాన సంద‌ర్బంలో గ‌ల్లా ప్ర‌సంగం పై అభినంద‌లు వెల్లు వెత్తాయి. ప్ర‌ధానిని మిష్ట‌ర్ ప్రైమ్ మినిష్ట‌ర్ అంటూ మోదీని సంబోధించ‌టం ద్వారా గ‌ల్లాను టిడిపి శ్రేణులు ప్ర‌శంసించాయి.

లోక్‌స‌భ లోనూ మంచి మార్కులే..
గుంటూరు ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌స్తుత వ‌య‌సు 52. ఆయ‌న తొలిసారిగా ఎంపీగా ఎన్నియ్యారు. ఎంపీగా ఎన్నికైన త‌రువాత లోక్‌స‌భ లో జ‌రిగిన 113 చ‌ర్చ‌ల్లో జ‌య‌దేవ్ పాల్గొన్నారు. ఆరు ప్ర‌యివేటు బిల్లులు ప్ర‌వేశ పెట్టారు. స‌భ‌లో 469 ప్ర‌శ్న‌లు సంధించారు. అందులో రాష్ట్ర స‌గ‌టు జ‌య‌దేవ్ ది 242 కాగా, జాతీయ స్థాయిలో 273 గా లోక్‌స‌భ రికార్డు లు స్ప‌ష్టం చేస్తున్నాయి. కాగా,ఆయ‌న హాజ‌రు శాతం గా న‌మోదైంది.

ఈ సారి హోరా హోరీ త‌ప్ప‌దు..

2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టిడిపి గెల‌వ‌గా..ఈ సారి ఎలాగైనా త‌న ప‌ట్టు నిరూపించుకోవాల‌ని వైసిపి భావిస్తోంది. అదే స‌మ‌యంలో..తిరిగి గ‌ల్లాకు టిక్కెట్ ఖాయంగా క‌నిపిస్తోంది. తిరిగి గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల తో జ‌య‌దేవ్ ఉన్నారు. అయితే, వైసిపి ఇప్ప‌టికే ఇద్ద‌రు లోక్‌స‌భ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చింది. ప్ర‌స్తుతం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా కిలారి రోశ‌య్య వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఇక‌, ఈ సారి జ‌న‌సేన సైతం ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్..బిజెపి సైతం బ‌రి లో నిల‌వాల‌ని భావిస్తోంది. మ‌రి..అన్ని పార్టీలు రాజ‌ధాని కేంద్ర‌మైన గుంటూరు లో స‌త్తా చాటాల‌ని స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత రాజ‌కీయ రంజు గుంటూరులో త‌ప్పేలా లేదు.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Guntur Lok Sabha Constituency of Andhra Pradesh. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Guntur .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X