రాజధాని జేఏసీ నేతలను కలవనన్న మంత్రి సుచరిత ... మంత్రి తీరుపై మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికే ఉధృతంగా సాగుతుంది. రేపే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకునే క్యాబినెట్ భేటీ కాబోతున్న నేపధ్యంలో నేడు మరింత ఉధృతంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు రాజధాని ప్రాంత రైతులు. మరోపక్క అమరావతి పరిరక్షణా జేఏసీ వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను, కీలక నాయకులను కలిసి వినతి పత్రాలు అందిస్తూ రాజధాని తరలిపోకుండా చూడాలని కోరుతుంది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి వినతి పత్రం ఇచ్చిన రాజధాని జేఏసీ నాయకులు నేడు గవర్నర్ ను కలవనున్నారు, ఇదే సమయంలో మంత్రులకు కూడా తమ విజ్ఞప్తి తెలియజేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసేందుకు ప్రయత్నించిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని జేఏసీ నాయకులకు మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు.

Minister Sucharita refused to meet the leaders of the capital amaravati JAC

ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తున్న అమరావతి పరరక్షణ సమితి నేతలు.. అందులో భాగంగా హోం మంత్రికి కూడా తమ విజ్ఞప్తి తెలియజేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిని తరలించొద్దనే డిమాండ్ తో వారు మంత్రిని కలవాలని భావించారు. అయితే, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరు సరికాదని మండిపడుతున్నారు. మంత్రిగా ఉండి ప్రజల ఆకాంక్ష కూడా తెలుసుకోలేని మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సుచరిత ప్రజాభిప్రాయం తెలుసుకోవటం బాధ్యతగా భావించాలని, లేనిచో తగిన సమయంలో గుణ పాఠం చెప్పి తీరతామని అంటున్నారు రాజధాని రైతులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+