గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజం చెప్పులు వేసుకునేలోపు.. జగన్ అబద్దం ప్రపంచాన్ని చుట్టివచ్చింది: నారా లోకేశ్ నిప్పులు..

|
Google Oneindia TeluguNews

జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని.. వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ కూడా ఇలానే జరిగిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అవినీతి జరగలేదని ఏసీబీ డీజీ చెప్పారని గుర్తుచేశారు. అంతేకాదు ఇటీవల టీవీ డిబేట్‌లో మంత్రి చేసిన కామెంట్లకు సంబంధించి వీడియో ట్వీట్ చేశారు. ఇదీ ప్రభుత్వం చేస్తోన్న కక్షసాధింపు చర్యలకు ప్రత్యక్ష నిదర్శనం అని ధ్వజమెత్తారు.

వరద బాధితుల పేరుతో బురద రాజకీయాలు, సీఎం జగన్‌పై లోకేశ్ విసుర్లు..వరద బాధితుల పేరుతో బురద రాజకీయాలు, సీఎం జగన్‌పై లోకేశ్ విసుర్లు..

ప్రపంచం చుట్టొచ్చిన అబద్దం..

ఈఎస్ఐ స్కాంలో నిజం చెప్పులు వేసుకునేలోపు అంటూ నారా లోకేశ్ ట్వీట్ ప్రారంభించారు. జగన్ సర్కార్ చేసిన అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చిందని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడిపై కక్షపూరితంగానే ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి.. ఇబ్బంది పెట్టి ఆనందం పొంది ఉండొచ్చు కానీ అంతిమంగా సత్యమే గెలిచిందని చెప్పారు. అచ్చెన్నాయుడిని ఏసీబీ కేసులో ఇరికించామని ప్రభుత్వమే తెలిపిందని పేర్కొన్నారు.

మంత్రి వ్యాఖ్యలు..

మంత్రి వ్యాఖ్యలు..


లోకేశ్ పోస్ట్ చేసిన వీడియోలో అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారనే కథనం ఉంది. ఓ టీవీ చానెల్ చర్చలో మంత్రి జయరాం పాల్గొన్నారు. కేసులో కావాలనే ఇరికించామనే మంత్రి అన్నట్టు వినిపించింది. అంతేకాదు ఈఎస్ఐ స్కాం తొలుత 900 కోట్లు అని పేర్కొన్నారు. తర్వాత రూ.3 కోట్లు అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 70 రోజులు విచారించిన తర్వాత ఆధారాలు లేవు అని పేర్కొనడం ఏంటీ అని లోకేశ్ అడిగారు. ఆగస్ట్ 28వ తేదీన హైకోర్టుకు సమర్పించిన పిటిషన్‌ను కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు అని చెప్పడంతో హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కక్షతోనే అచ్చెన్నాయుడిని ఇరికించారని పేర్కొన్నారు.

దర్యాప్తులో తేలలేదు.. కానీ

దర్యాప్తులో తేలలేదు.. కానీ


ఈఎస్ఐ స్కాంలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీమంత్రి అచ్చెన్నాయుడికి నగదు తీసుకున్నట్టు దర్యాప్తులో ఎక్కడా ఆధారాలు లభించలేదని ఏసీబీ డీజీ ఇదివరకే తెలిపారు. పలు కంపెనీలు మంత్రి వద్దకు వస్తుంటాయని.. ఆ సమయంలో అధికారులకు సిఫారసు చేయవచ్చు... కానీ వాటిని అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులకు ఛాన్స్ ఇవ్వాలన్నారు.

Recommended Video

TDP State President రేసులో Atchannaidu, Ram Mohan Naidu జస్ట్ మిస్ ! || Oneindia Telugu
రూ.150 కోట్ల నష్టం..

రూ.150 కోట్ల నష్టం..


టెండర్‌కు వెళ్లాల్సిన వాటికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించొద్దు అని ఏసీబీ డీజీ తెలిపారు. 2016-19లో ఈఎఎస్ఐ వైద్య పరికరాలు, మందులు, టెలి మెడిసన్‌ సేవలలపై ఈ-టెండర్లు నిర్వహించకుండా రూ.975 కోట్లతో కొనుగోలు చేశారన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.150 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు.
లక్ష రూపాయలకు ఎక్కువ గల వస్తువులు/పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ-టెండర్‌ పిలవాలి. రూ.వందల కోట్ల కొనుగోళ్లలో ఈ-టెండర్ పిలువకపోవడం.. కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ కొనుగోళ్లు చేయడంతో అవినీతి జరిగి ఉంటుందన్నారు. కానీ ఆధారాలు మాత్రం లభించలేదు. దీంతో తాజాగా చేసిన మంత్రి వ్యాఖ్యలతో లోకేశ్ విరుచుకుపడ్డారు.

English summary
nara lokesh slams cm jagan on atchannaidu arrest issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X