లోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి: విజయసాయి చురకలు
అమరావతి: గ్రామ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్‌కు నోటి దూల ఎక్కువైందని.. అతన్ని కరోనా క్వారంటైన్‌లో పెట్టాలని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

ఎవరి బిర్రు చూసుకుని..
‘ఎన్టీఆర్‌ను కూలదోసిన కుట్రలో బాబు దోస్తు, యనమల గారిలో ఈమధ్య అసహనం కట్టలు తెంచుకుంది. స్థానిక ఎన్నికల్లో సిఎం జగన్ గారు 59.85% రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం బిసిలకు ద్రోహం చేసినట్టట. ఎవరి ‘బిర్రు' చూసుకుని ప్రతాపరెడ్డి కోర్టుకు వెళ్లాడో తెలియదనుకుంటున్నాడు' అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

లోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ లో పెట్టాలి..
‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

అంగిట బెల్లం ఆత్మలో విషం..
‘'అంగిట బెల్లం ఆత్మలో విషం' అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు' అని విజయసాయి విమర్శించారు.
Recommended Video


చంద్రబాబుకు చిత్తశూద్ధే లేదు..
‘అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు' అని చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఆరోపించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications