బాలకృష్ణ భారీ డైలాగ్ .. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో.. మేం అరిచే వాళ్ళం కాదు కరిచే వాళ్ళం
సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. ఆయన తొడగొట్టినా, మీసం తిప్పినా విశేషమే. ఇక ఆయన చేసే వ్యాఖ్యలు సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బాలకృష్ణ తాజాగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మేము అరిచే వాళ్ళం కాదు,కరిచే వాళ్లం అంటూ బాలయ్య కొట్టిన డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

కుక్క మొరిగితే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇంతకీ బాలయ్య ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు గమనిస్తే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీ హాల్ కు నడుచుకుంటూ వెళుతున్నారు బాలకృష్ణ. ఇక ఇదే సమయంలో అక్కడ ఉన్న ఒక కుక్క మొరిగింది. అది గమనించిన బాలయ్య చాలా సందర్భోచితంగా స్పందించారు. ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాలని, తాము అరిచే వాళ్లం కాదని, కరిచే వాళ్ళం అని బాలయ్య భారీ డైలాగ్ కొట్టారు. ఇక ఇది వైసిపి నాయకులను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన పరోక్ష వ్యాఖ్యలని చర్చ జరుగుతోంది.

తేదేఒఏ నుండి ముందు ఓటేసిన బాలకృష్ణ
ఇక నేడు ఏపీలో అసెంబ్లీ హాల్ లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న బాలయ్య టీడీపీ నుండి మొదట తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఓటేశారు. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు పలువురు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ లో పాల్గొనని టీడీపీ నేతలు
అరెస్టు కారణంగా అచ్చెన్నాయుడు, అనారోగ్య కారణంగా అనగాని సత్య ప్రసాద్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. అనగాని సత్యప్రసాద్ తాను ఓటింగ్లో పాల్గొనలేకపోవడానికి గల కారణాన్నిటీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు 167 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుండి ముందుగా బాలకృష్ణ ఓటేశారు.
Recommended Video

ఇంతకాలం కరవలేదే అంటూ నెటిజన్ల సెటైర్లు
ఇక టిడిపి రెబల్ ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ,మద్దాలి గిరి, కరణం బలరాం ఎవరికి ఓటు వేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైసీపీకి వేస్తారని తెలిసినప్పటికీ ఇంకా వైసీపీలో చేరలేదు కాబట్టి వారేం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి భారీ డైలాగ్ చెప్పిన బాలయ్య, తాము అరిచే వాళ్ళం కాదు కరిచేవాళ్ళం అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు కానీ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నా,పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా బాలయ్య కరవలేకపోయారు ఎందుకో అన్న సెటైర్లు తాజా బాలయ్య వ్యాఖ్యలతో పేలుతున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications