2 రోజుల్లో 1.10 లక్షల లడ్డూల విక్రయం, శ్రీవారి ప్రసాదం కోసం క్యూ లైన్‌లో జనం బారులు...
తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఏ లడ్డూకి లేని టేస్ట్ లడ్డూ సొంతం. తిరుపతి లడ్డూ పేరు చెబితనే నోటిలో ఊరిలు వస్తుంటాయి. ఆ మధురమైన స్వామివారి ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల తిరుమల ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో లడ్డూ ప్రసాదం కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రసాదం ఉత్తత్తి ప్రారంభించారు. దీంతో భక్తులు కొనుగోలు చేసేందుకు ఎగబాకారు.
తిరుపతిలోనే గాక లడ్డూలను హైదరాబాద్‌లో ఉన్న టీటీడీ ఆలయానికి పంపించారు. లక్ష 35 వేల లడ్డూలను పంపించగా.. రెండురోజుల్లోనే లక్ష పదివేల లడ్డూలను కొనుగోలు చేశారు. వాస్తవానికి లడ్డూ ధర రూ.50 కాగా.. లడ్డూలను రూ.25కి సబ్సిడీకి అందజేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా సబ్సిడీకి లడ్డూలను అందజేస్తోంది. ఏపీలో గతనెల 25వ తేదీ నుంచి లడ్డూలను విక్రయిస్తోంది.

హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో గల టీటీడీ ఆలయం వద్ద లడ్డూల కోసం జనం బారులుతీరారు అయితే లడ్డూ కొనుగోలు చేశామని.. కానీ స్వామివారి దర్శనం కాలేదని భక్తులు అంటున్నారు. ఉన్న ప్రసాదం అయిపోతే మరిన్ని లడ్డూలు కూడా వస్తాయని అధికారులు తెలిపారు. కానీ క్యూలైన్ వద్ద భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అధికారులు కోరుతున్నారు. విధిగా శానిటైజర్ తమ వద్ద ఉంచుకోవాలని.. గ్లౌజ్ కూడా వేసుకోవాలని కోరారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications