హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్: పరారీలో 10 మంది, ముంబై నుంచి సప్లై

|
Google Oneindia TeluguNews

డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలోకి వచ్చాయి. మొత్తం 23 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏడుగురు వ్యాపారవేత్తలతోపాటు ఇద్దరు ఆఫీస్ బాయ్స్‌ను అరెస్టు చేశారు. టోనీతో సంబంధాలు ఉన్న నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు. అశోక్ జైన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రసాద్, సంజయ్ పరారీలో ఉన్నారు.

డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ బిజినెస్ మెన్లు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీతో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నారు. పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండిని అరెస్ట్ చేశారు. మసాలా దినుసులతో ఆనంద్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. A-1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్ అరెస్ట్ చేశారు.

10 people absconding on drugs case

రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్‌ను అరెస్టు చేశారు. ఆంధ్రాలోనూ పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్నారు. శంషాబాద్‌లో వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో‌లో ఈట సర్ప్‌ను జైన్ పరిచయం చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను ఆయన చేపట్టారు. నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాద్ లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.

Recommended Video

COVID 19 టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి When To Take The Test For COVID-19 | Oneindia Telugu

వ్యాపారి బండి భార్గవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బండి భార్గవ్ పలు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపొర్ట్ వ్యాపారి వెంకట్ చలసానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్, వెంకట్ కలిసి పార్టనర్స్‌గా వ్యాపారం చేస్తున్నారు. భార్గవ్, వెంకట్ కలిసి హైదరాబా‌ద్‌లో అంతర్జాతీయ స్కూల్‌లో చదువుకున్నారు. భార్గవ్, వెంకట్ కలిసి వందల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించారు. వెంకట్ చలసాని తండ్రి పెద్ద కాంట్రాక్టర్. వ్యాపారవేత్త తమ్మినేని సాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
10 people absconding on drugs case hyderabad police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X