100 మంది పాత్ర..? సికింద్రాబాద్ ఇన్సిడెంట్‌లో సిట్ ఎంక్వైరీ స్పీడప్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ఆందోళనకారులు రెచ్చిపోయారు. కాల్పులు జరగగా ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనపై సిట్ విచారిస్తోంది. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విధ్వంసానికి కారకులు ఎవరో తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
ఇన్సిడెంట్‌లో ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ పాత్రపై ఆరా తీస్తున్నారు. నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు సమక్షంలో తనిఖీలు చేపట్టారు. నిన్నటి నుంచి సుబ్బారావును అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

వాట్సప్ చాటింగ్, కాల్ రికార్డింగ్స్ , సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు స్పీడ్ అందుకుంది. విధ్వంసం కుట్ర వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. విధ్వంసం వెనుక 16 కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని రైల్వే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆదోళనకారుల నుంచి 10కి పైగా వాట్సప్ గ్రూప్‌లను గుర్తించారు. వాట్సప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో 15 మందిని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని మరీ ప్రశ్నిస్తున్నారు. మరో 25 మంది పాత్ర ఉందని గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 56 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది. వారందరినీ విచారిస్తామని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు చెబుతున్నారు. అగ్నిపథ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications