తెలంగాణలో కరోనా కల్లోలం: వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు
ఓ వైపు జ్వరాలు.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల వరకు కేసులు వచ్చాయి. ఇప్పుడు అదీ 1000 దాటింది. కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదైంది. గత 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,054 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు. 630 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు వచ్చాయి. 8,11,568 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 5,992 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 4,111 మంది మరణించారు.

సెకండ్ వేవ్ పమయంలో అల్లాడించింది. దేశం.. రాష్ట్రంలో భారీగా మరణాలు సంభవించాయి. ఆ తర్వాతే అందరూ డోసులు తీసుకున్నారు. ఇప్పుడు దేశంలో బూస్టర్ డోసు ప్రక్రియ కూడా పూర్తి అవనుంది. కరోనా టీకా తీసుకుంటే.. కొందరికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందని జర్నల్స్ కూడా ప్రచురించాయి. అందుకోసం కొందరు సెకండ్ డోసు తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications