Hyderabad: 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్..!
హైదరాబాద్ కల్తీ పదార్థాలు తయారు చేసే వారు పెరిగిపోయారు. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతీ దాన్ని కల్తీ చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటి నుంచో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సిటీలోని చాలా రెస్టారెంట్ల, హోటల్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది.
నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లే వీరు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. బోయిన్‌పల్లి, రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో 'సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరిట దందా కొనసాగుతోంది. 4లక్షల 50 వేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు తయారీలో కెమికల్స్, కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి వాడుతున్నట్లు తెలిసింది. ఈ అల్లం, వెల్లుల్లితో చేసిన పదార్థాలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లు తయారు చేస్తున్న 8మందిని పోలీసులు పట్టుకున్నారు.

సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిసిందే. గత నెల 8న టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లోని కోణార్క్ టీ ప్రాంగణంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ భారీ ఎత్తున కల్తీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. కోణార్క్ టీ వారు చాపత్తను హైదరాబాద్‌లోని వివిధ టీ స్టాల్స్‌కు ప్యాక్ చేసి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు టీ పౌడర్ లో హానికరమైన పదార్ధాలను కలుపుతున్నట్లు గుర్తించారు. 300 కిలోల వదులుగా ఉండే టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొడి, నాన్-ఫుడ్-గ్రేడ్ ఎరుపు, నారింజ రంగులు ఒక్కొక్కటి 5 కిలోలు, చాక్లెట్, ఏలకులు, పాలు వంటి కృత్రిమ రుచులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా కల్తీకి హైదరాబాద్ అడ్డగా మారినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. 19 నగరాల్లో సర్వే చేయగా.. కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయ్యాయని నివేదికలో పేర్కొంది. సిటీలోని హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరించింది. 62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు నివేదికలో పేర్కొంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications