తెలంగాణలో 218 కరోనా కేసులు: ఒకరు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 300 లోపు వస్తున్నాయి. గత 24 గంటల్లో 46,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,657 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video
రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం.












Click it and Unblock the Notifications