తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 2500 పైగా పాజిటివ్.. 18 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,524 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 307 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,78,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,40,986 మంది కోలుకున్నారు. ఇంకా 34,084 మంది చికిత్స పొందుతున్నారు. అటు, రాష్ట్రంలో రికవరీ రేటు 93.53 శాతానికి పెరిగింది. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 5,40,986 మంది రికవరీ అయ్యారు. మరోవైపు రెండో దశలో కరోనా ఎన్నో కుటుంబాలను అల్లకల్లోలం చేసింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్ద మరణంతో బతుకు భరోసా కోల్పోయి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

2524 corona cases register in telangana state..

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి కన్నీరు పెట్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే కన్నవారు మరలిరాని లోకాలకు వెళ్లడంతో అప్పటిదాకా ఏ లోటూ లేకుండా ఆనందంగా గడిపిన ఆ చిన్నారులు ఒక్కసారిగా దిక్కులేనివారవుతున్నారు.

వేసవిలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+