విషాదం: అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వరద: నీటిలో మూడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా కలిగిస్తోంది. ఇప్పటి భారీ వర్షాల కారణంగా ఓ పాత భవనం కూలి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరద నీటిలో పడి ఓ మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
దిల్‌సుఖ్‌నగర్ సాహితీ అపార్టమెంట్ సెల్లార్ నీటిలో మునిగి అజిత్ సాయి అనే మూడేళ్లపాడు మృతి చెందాడు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో రాత్రి అంతా ఇంట్లో నుంచి బయటికి రాలేదు.

బుధవారం ఉదయం ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు మూడేళ్ల బాలుడు. వెంటనే బాబు తండ్రి యుగేందర్ కిందికి వెళ్లాడు. అప్పటికే బాబు నీళ్లలో పడిపోయిన బాబును బయటికి తీశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. బాలుడి మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాద ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగర రహదారులు, కాలనీల్లో వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజుల వరకు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవసర ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం 040-21111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications