తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు.

తాజాగా నమోదైన కేసుల్లో 26 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, రెండు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. మిగిలిన 10 ఇతర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. గురువారం 23 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1036 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్ కేసులున్నాయి.

38 new corona cases recorded in telangana and death toll to 45.

ఇక దేశ వ్యాప్తంగా 1,15,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 46,840 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 64,937 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,498 మరణాలు సంభవించాయి. కాగా, దేశ వ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ పలు సడలింపులను రాష్ట్రాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+