హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజురాబాద్‌లో భారీగా పోలింగ్.. 3 గంటల వరకు 60 శాతం పైగా

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ భారీగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మధ్యాహ్నాం 3 గంటల వరకు 61.66 శాతం ఓటింగ్ నమోదైంది. ఇదే ట్రెండ్ కొనసాగితే సాయంత్రం లోపు 85 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. అత్యధికంగా వీణవంక మండలంలో 47.65 శాతం పోలింగ్ నమోదవ్వగా 19 వేల 106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యంత తక్కువగా ఇల్లందకుంటలో 42.09 శాతం పోలింగ్‌ నమోదవ్వగా 10 వేల 439 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక హుజూరాబాద్‌లో 45.05 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 27 వేల 784 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో 46.76 శాతం, జమ్మికుంటలో 45.36 శాతం పోలింగ్ నమోదైంది.

60 percent above polling after 3pm at huzurabad. voters are queue in the line.

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం హిమ్మత్‌ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హిమ్మత్‌ నగర్‌కు బీజేపీ నేత తుల ఉమా రావడాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తీవ్రంగా తప్పు పట్టారు. పోలింగ్ కేంద్రానికి నాన్‌ లోకల్స్‌ ఎలా వస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. టీఆర్‌ఎస్‌ నేతల ఆందోళనకు పోటీగా బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. .వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

English summary
60 percent above polling after 3pm at huzurabad. voters are queue in the line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X