తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. 705 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ర్టంలో జ్వరాల సీజన్ నడుస్తోంది. ఏ ఇళ్లు చూడు టైఫాయిడ్.. లేదంటే వైరల్ ఫీవర్ కనిపిస్తోంది. ఇటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. దీంతో మాస్క్ మ్యాండేటరి అని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో రోజువారీ కేసులు వెయ్యికి దగ్గరగా రాగా.. గత 24 గంటల్లో తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా కూడా కేసుల ప్రభావం అంతగా లేదు.

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 32,834 శాంపిల్స్ పరీక్షించగా, 705 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 355 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 48, కరీంనగర్ జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

705 people are infected corona in telangana

531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,19,846 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,192 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 5,543 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 4,111 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సెకండ్ వేవ్ పమయంలో అల్లాడించింది. దేశం.. రాష్ట్రంలో భారీగా మరణాలు సంభవించాయి. ఆ తర్వాతే అందరూ డోసులు తీసుకున్నారు. ఇప్పుడు దేశంలో బూస్టర్ డోసు ప్రక్రియ కూడా పూర్తి అవనుంది. కరోనా టీకా తీసుకుంటే.. కొందరికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందని జర్నల్స్ కూడా ప్రచురించాయి. అందుకోసం కొందరు సెకండ్ డోసు తీసుకోవడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+