తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 771 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ర్టంలో జ్వరాల సీజన్ నడుస్తోంది. ఏ ఇళ్లు చూడు టైఫాయిడ్.. లేదంటే వైరల్ ఫీవర్ కనిపిస్తోంది. ఇటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. దీంతో మాస్క్ మ్యాండేటరి అని వైద్యులు సూచిస్తున్నారు. గత 24 గంటల్లో 39,320 శాంపిల్స్ పరీక్షించగా, 771 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 289 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 53, పెద్దపల్లి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు వెల్లడయ్యాయి.

581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,20,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,773 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 5,733 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
సెకండ్ వేవ్ పమయంలో అల్లాడించింది. దేశం.. రాష్ట్రంలో భారీగా మరణాలు సంభవించాయి. ఆ తర్వాతే అందరూ డోసులు తీసుకున్నారు. ఇప్పుడు దేశంలో బూస్టర్ డోసు ప్రక్రియ కూడా పూర్తి అవనుంది. కరోనా టీకా తీసుకుంటే.. కొందరికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందని జర్నల్స్ కూడా ప్రచురించాయి. అందుకోసం కొందరు సెకండ్ డోసు తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications