Hyderabad: సాగర్ రోడ్డులో కుప్పకూలిన ఫ్లైఓవర్ ర్యాంప్.. 9 మందికి గాయాలు..
హైదరాబాద్‍లోని సాగర్ రోడ్డులోని నిర్మాణంలో పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గత రాత్రి నిర్మాణ పనులు చేస్తుండగా.. ఫ్లైఓవర్ ర్యాంపు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. గాయపడిన కూలీలు అంతా బీహార్ కు చెందినవారిగా తెలుస్తోంది.

గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రమాదస్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంజినీర్ల బృందం విచారణ చేసే అవకాశం ఉంది. గాయపడిన వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. కాంట్రక్టర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం నైరుతి ఢిల్లీలోని రాజోక్రిలో NH-48 సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ - ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగం - రెండు స్తంభాల మధ్య కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు షకీల్ మృతి చెందాడు. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం మెకానికల్ వైఫల్యం కాణంగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
కుప్పకూలిన సాగర్ రోడ్డు లోని నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంపు పిల్లర్ టు పిల్లర్ స్లాబ్ చేస్తుండుగా కుప్పకూలిన ఫ్లైఓవర్..!!#LBNagar #LBNagarFlyover #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/EFpqvmCoLF
— oneindiatelugu (@oneindiatelugu) June 21, 2023












Click it and Unblock the Notifications