Fire Accident: పాతబస్తీలోని మదీనాలో అగ్ని ప్రమాదం..
హైదరాబా(hyderabad)ద్‍లో వరుస అగ్నిప్రమాదాలు(Fire Accident) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పాతబస్తీలోని మదీనా బల్డింగ్ లో ఉన్న జాకీ గార్మెంట్స్ షోరూమ్ లో మంటలు వచ్చాయి. ఈ ఘటనలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చివరికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అంతకముందు చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ వాసులు వివాహ వేడుకకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బాల్కనీ ప్రాంతం నుంచి మంటలు చెలరేగాయని, బహుశా వేరే చోట నుంచి పడిన క్రాకర్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదంతో రూ. 5-6 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు చెప్పారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.

ఇటీవల బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్ గ్యారేజీలో వచ్చిన మంటలు త్వరగా పై అంతస్తులకు వ్యాపించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అనీస్ ఉల్ గుర్బా సమీపంలో గత మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
హైదరాబాద్‌లో 2019 నుంచి ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదు కాగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల విభాగం కార్యకర్త కరీం అన్సారీకి RTI సమాధానంలో వివరించింది. ఈ సంఘటనలు నగరంలో 120 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. సోమవారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ తగలబడింది.శాలిబండ ఏరియాలోని గోమతీ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న షోరూంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications