Hyderabad: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో మంటలు..!
గురువారం హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కు గత రాత్రి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) తిరిగి వచ్చింది. విమానం ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక ఇంజన్ నుంచి నిప్పురవ్వలు వచ్చాయి. సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ నుంచి అనుమతి కోరి ల్యాండ్ చేశాడు.
గురువారం తెల్లవారుజామున మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కౌలాలంపూర్ బయల్దేరింది. విమానం గాల్లోకి లేచింది. 15 నిమిషాల విమానం కుడి వైపు ఇంజిన్ లో నిప్పురవ్వలు బయటకొచ్చాయి. వెంటనే గమనించిన పైలట్ ఏటీసీ విషయాన్ని తెలిపాడు. దీంతో ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. విమానంలో మొత్తం 138 మంది ఉన్నారు. విమానం ఎమర్జేన్సీ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గత నెలలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో ఆర్‌జీఐఏ వద్ద రన్‌వేపై నిలిచిపోయింది. దాదాపు గంటపాటు రన్‌వేపైనే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

Technical snag in Hyderabad- Kuala Lumpur flight that started last night. It returned to Hyderabad this morning. Lot of inconvenience caused to passengers. Sparks emanated from one of the engines within 14 minutes of takeoff. The pilot sought permission from the ATC for an… pic.twitter.com/sP80TM2AOv
— Saye Sekhar Angara (@sayesekhar) June 20, 2024












Click it and Unblock the Notifications