Hyderabad: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లతో మహిళను మోసం చేసి రూ.9 లక్షలు కాజేసిన వ్యక్తి..

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో మహిళలను మోసం చేస్తున్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడి నుంచి బంగారం, చెక్ బుక్, క్రెటిడ్ కార్డు, మెబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మోహన్ రెడ్డి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో మహిళలతో పరిచయం పెంచుకుంటాడు.

వారితో స్నేహం చేయడం, ఆపై కలుసుకోవడానికి వారిని హోటల్‌కు ఆహ్వానించడం చేస్తాడు. అక్కడ వారి విలువైన వస్తువులను మోహన్ రెడ్డి దొంగిలిస్తాడు. మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు దొంగిలించబడిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అతను పారిపోతుంటాడు. ఆ తర్వాత ఫోన్ నంబర్ మార్చేస్తాడు. ఇలానే ఓ మహిళతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో పరిచయం చేసుకున్నాడు.

A man who cheated a woman with matrimonial websites and got Rs 9 lakh has been arrested by the police

ఒకసారి కలవాలి ఫలనా హోటల్ రావాలని కోరాడు. దీంతో సదరు మహిళ ఓటల్ కు వచ్చింది. ఆ మహిళ వాష్ రూమ్ వెళ్లంగానే ఆమె ఫోన్, ఇతర వస్తువులను మోహన్ రెడ్డి ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడని పట్టుకున్నారు. మోహన్ రెడ్డి తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు.

అతను వితంతువులతో సహా మహిళలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు పేర్లతో పలు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకునేవాడని పోలీసులు వెల్లడించారు. అతను మ్యాట్రిమోనియల్ సైట్‌లో మరో మహిళను పరిచయం చేసుకుని తన ఖాతాలోకి రూ.9 లక్షలు బదిలీ చేయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను అందుబాటులో లేకుండా పోయాడని పేర్కొన్నారు. మోహన్ రెడ్డిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు ఉన్నాయి. గురువారం మోండా మార్కెట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+