Crime News: బాలానగర్‍లో దారుణం.. పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న మహిళ..
చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విడిపోతున్న రోజులివి.. విడిపోతే ఫర్వాలేదు కానీ.. చిన్న చిన్న మనస్పర్దలతో ప్రాణాలు తీసుకుంటే పిల్లల జీవితంతో పాటు.. కట్టుకున్న వాళ్ల జీవితం కూడా అగమ్యాగోచరంగా మారుతుంది. తాజాగా హైదరాబాద్ లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మహేశ్,అనిత
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మహేశ్,అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు వర్షిణి, కుమారుడు శ్రీహాన్ ఉన్నారు. వీరు గత నాలుగేళ్లుగా బాలానగర్ డివిజన్ గౌతంనగర్‌లో నివాసం ఉంటున్నారు. మహేష్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

గొడవలు
ఈ క్రమంలో పలు మార్లు గొడవలు కూడా జరిగాయి. మంగళవారం మహేష్ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఎంతసేపు తలుపు కొట్టిన అనిత తలుపులు తీయలేదు. దీంతో మహేష్ కిటికీలోంచి చూశాడు. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోస్ట్ మార్టం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరేసుకుని ఉంది. బెడ్ లో ఇద్దురు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications