Hyderabad: బీజేపీ కార్నర్ మీటింగ్‍ను అడ్డుకున్న ఎంఐఎం..

హైదరాబాద్ మోచి కాలనీలో బీజేపీ కార్నర్ మీటింగ్‍ను ఎంఐఎం కార్పొరేటర్ అడ్డుకున్నారు.

తమను సమావేశాన్ని నిర్వహించకుండా అడ్డుకున్న ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కార్పొరేటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు గురువారం ఓల్డ్ సిటీలోని కాలాపతేర్‌లో ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదు మేరకు కాలాపతేర్ పోలీసులు ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాలాపతేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి కాలనీలో బీజేపీ స్థానిక విభాగం వీధి కార్నర్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలుసుకున్న ఏఐఎంఐఎంకు చెందిన రాంనాస్‌పుర కార్పొరేటర్‌ మహ్మద్‌ ఖాదర్‌, కార్యకర్తలతో కలిసి వచ్చి కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు కాలాపతేర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఏఐఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

A MIM corporator blocked BJPs corner meeting in Hyderabads Mochi Colony
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలాపతేర్ మోచి కాలనీ, ఐటీఐ, పరిసర ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు పికెట్లు మోహరించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+