Kidnap: ప్రియుడితో కలిసి అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి..!
హైదరాబాద్ గచ్చిబౌలిలో కిడ్నాప్ కు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ ను ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద అటవీ శాఖ అధికారులు కాపాడారు. సురేందర్ ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. సురేందర్ చెల్లి నిఖిత కిడ్నాపర్ సురేశ్ తో కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కిడ్నాపర్లు శుక్రవారం సాయంత్రం కారులో శ్రీశైలం రోడ్డులో సురేందర్‌ను తీసుకువెళ్తుండగా కర్నూల్ జిల్లా ఆత్మకూరు బైరుట్టి వద్ద అటవీ శాఖ సిబ్బంది అనుమానం వచ్చి వీరి కారును ఆపారు.
దీంతో కిడ్నాప్ కథ బయటకొచ్చింది. ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. ఈ కిడ్నాప్ కేసులో నిందితులను విచారించడంతో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరినే ప్రధాని సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. జనవరి 4న సాయంత్రం కాజాగూడ చెరువు వద్ద తన చెల్లెలితో మాట్లాడుతుండగా సురేందర్ ను సురేష్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు.

ఈనెల 4వ తేదీన ఖాజగూడ వద్ద సురేందర్ అనే వ్యక్తి కిడ్నాప్ అయనట్టు డయల్ హండ్రెడ్ ద్వారా సమచారం అందిందని డీసీపీ పేర్కొన్నారు. కిడ్నాప్ కేసును 48 గంటల్లో చేధించామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అరున్ననకు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న వారు బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారు అని చెప్పారని వివరించారు.
దీంతో తాము నిఖితను ప్రశ్నించామని.. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు అరు టింలను ఫామ్ చేసి గాలింపు చేపట్టినట్లు తెలిపారు.నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ ఈ కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సురేందర్ ను కిడ్నాప్ చేసి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి కిడ్నాప్ అయినా సురేందర్ చేత వాలంటీర్ గా వెళుతున్నానని చెప్పించారని వివరించారు.
వీరి కారును కర్తాల్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఆపారు. ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.ముందుగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసి అనంతరం రూ.20 లక్షలు ఇచ్చినా చాలని కిడ్నాపర్లు చెప్పినట్లు వివరించారు. నిందితులపై గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తామని డీసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications