Gold: బంగారంపై పెట్టుబడి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మోసం..

బంగారంపై పెట్టుబడి పేరుతో ప్రజలను మోసం చేసి రూ.6.12 కోట్ల మేర మోసం చేసిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీస్‌స్టేషన్‌ ఈ రాకెట్‌ను ఛేదించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన గంటా శ్రీధర్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. బంగారంపై పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి ఇస్తామని శ్రీధర్ బాధితులను నమ్మిచ్చాడు.

నిందితుడు తన కార్యాలయంలో సహోద్యోగులతో సహా 13 మంది బాధితులను రూ.6.12 కోట్ల మేర వసూలు మోసగించినట్లు సైబరాబాద్‌లోని ఈఓడబ్ల్యూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. ప్రసాద్ తెలిపారు. పోలీసులు నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 406, 420 IPC, తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 1999లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

A software employee cheated in the name of investing in gold

ఫిబ్రవరి 22, 2024న నిందితుడు బంగారం పెట్టుబడి పథకం గురించి ఫిర్యాదుదారుడికి సందేశం పంపాడు. 100 నుంచి 200 గ్రాముల బంగారాన్ని రూ.5,950 కు, 300 నుంచి 500 గ్రాములకు బంగారాన్ని రూ.5,850 చొప్పున ఇప్పిస్తానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు నిందితుడికి డబ్బు చెల్లించాడు. దాదాపు 25 రోజుల్లో బంగారం డెలివరీ చేస్తామని శ్రీధర్ చెప్పాడు. డబ్బులు చెల్లించినా ప్రసాద్ బంగారాన్ని డెలివరీ చేయకపోవడంతో ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

నిందితుడు మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు తాను ఉద్యోగం చేస్తున్న ఓఎస్‌ఐ డిజిటల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో తన సహోద్యోగులను మోసం చేసినట్లు గుర్తించారు. నిందితుడు శ్రీధర్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో 12 ఏళ్లుగా పని చెస్తున్నాడు. అతను మొదటగా.. నమ్మించి తర్వాత మోసానికి పాల్పడానట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+