Cyber Crime: ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్.. రూ.1.50 కోట్లు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని..
ఎన్ని సంఘటనలు జరిగినా కొంత మంది మాత్రం మారడం లేదు. అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కుతున్నారు. లక్షల్లో నష్టపోతున్నారు. గతంలో యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొడితే డబ్బులిస్తామని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్ ఇస్తే డబ్బు ఇస్తామని ఎరవేసి లక్షల్లో దండుకున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు వలలో ఎక్కువగా చదువుకున్నారే పడుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
తాజాగా హైదరాబాద్ లో ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్ ఇస్తే డబ్బులిస్తామని ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసం చేసి ఏకంగా కోటి 50 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ చెందిన ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

పార్ట్ టైమ్ జాబ్ ఉంది, చేస్తే డబ్బులు బాగా వస్తాయని చెప్పాడు. ఉద్యోగం కూడా చాలా సింపుల్ అని చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్ ఇస్తే చాలని.. డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పాడు. ఇది నమ్మిన ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రివ్యూ రేటింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. ఆ తర్వాత ఓ స్కీం ఉందని చెప్పాడు.
అందులో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని చెప్పాడు. ఇలా ఆమె వద్ద పలు ధపాలుగా రూ.1.50 కోట్లు లాగేశాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తే అవతలి వారు సరిగా స్పందంచలేదు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.సైబర్ మోసగాళ్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications