Software: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వద్ద రూ.12 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
సైబర్ నేరగాళ్ల చేతిలో చదువు లేని వారి కంటే చదువుకున్న వారే ఎక్కవగా మోసపోతున్నారు. చాలా మంది జాబ్ చేస్తున్నా.. సైడ్ ఇన్ కమ్ కోసం పార్ట్ టైమ్ కోసం ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. వీరిని గమనించి సైబర్ నేరగాళ్ల వారి వల వేస్తున్నారు. మోసం చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మోసం చేశారు. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.11 లక్షలు కాజేశారు.
ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఏషియన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతను ఇన్ స్టాగ్రామ్ లో వచ్చిన ఓ మెసేజ్ కు స్పందించాడు. దీంతో వెంటనే అవతలి ఫోన్ చేశారు. ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తామని.. పెట్టుబడి డబుల్ ఇన్ కమ్ వస్తుందని నమ్మించారు. నమ్మిన అనిల్ మొదటగా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాడు.

ఆ తర్వాత డబ్బు వెనక్కి తీసుకున్నాడు. అతన పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు వచ్చింది. అతను విడతల వారీగా రూ.60 నుంచి రూ.70 వేలు పెట్టుబడి పెట్టగా.. అతనికి రూ.1,10,000 వచ్చాయి. దీంతో ఇదేదో బాగానే ఉందనకున్న అనిల్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రూ.11,84,000 ఆన్ లైన్ సైబర్ కేటగాళ్లకు ట్రాన్స్ ఫర్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత డబ్బు తీసుకోవాలని వారికి ఫోన్ చేశాడు.
కానీ సైబర్ నేరగాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇలా కొద్ది రోజులు వేచి చూసిన అనిల్ తాను మోసపోయానని గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలా ఆన్ లైన్ ఎవరిని పడితే వారిని నమ్మకూడదని చెప్పారు. చదువుకున్నవారు కూడా ఇలా చేస్తే ఎలా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications