Sri Chaitanya: శ్రీ చైతన్య కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు..!
చాలా మంది కార్పొరేట్ కళాశాలలు అంటూ లక్షల్లో ఫీజ్ కట్టి వారి పిల్లలను చంపుకుంటున్నారు. తాజాగా నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బీపీసీ విద్యార్థి బలవన్మారణానికి పాల్పడ్డాడు. జశ్వంత్ గౌడ్( 17) అనే విద్యార్థిఅర్థరాత్రి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం విద్యార్థులు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతుడు కామారెడ్డి జిల్లా కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. బాలల దినోత్సవం రోజే విద్యార్థి చనిపోవడం బాధకరం. అయితే శ్రీచైతన్యల ఆత్మహత్య కొత్తేమి కాదు.
ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ లక్షల రూపాయల్లో ఫీజులు దండుకుంటుంది. చాలా వరకు శ్రీచైతన్య కాలేజీలకు అనుమతి లేదని తెలుస్తోంది. ఒక కాలేజీకి అనుమతి తెచ్చుకుని.. దాని పేరు ఐదారు కాలేజీలు నడుపుతున్నారు. నిజాంపేటలో ఆదిత్య భవన్ లో శ్రీచైతన్య కాలేజీ ఉంది. ఈ కాలేజీ గ్రౌండ్ లేదు. ఈ కాలేజీకి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో తెలియదు.

ఫైర్ సేఫ్టీ కూడా సరిగా లేదు. పైగా ఈ కాలేజీల్లో దోపిడీ ఎలా ఉంటుందంటే.. ఆన్ లైన్ లో ఎగ్జామ్ పెడతామని దాని యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అందుకు రూ.2వేలు తీసుకుని రాశీదు కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాకెట్ మనీ అని డబ్బులు తీసుకుని సిక్ రూమ్ వెళ్లిందని, ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పాకెట్ మనీ అయిపోయిందని చెబుతారని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. జనాలు గొర్రెల్లా శ్రీచైతన్య కాలేజీల్లో చేరుస్తున్నారని.. ఈ కాలేజీల్లో కూడా ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఉంటారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర మహిళా కమిషన్ నెరేళ్ల శారద మాదాపూర్ లోని శ్రీచైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. కాలేజీ ప్రాంగణం, విద్యార్థినిల హాస్టల్, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్ వడ్డించడం తో పాటు హాస్టల్‌లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications