‘విరూపాక్ష’ సినిమా ఆలస్యం: సిటీలో సినిమా థియేటర్‌పై ప్రేక్షకుల దాడి, ధ్వంసం

హైదరాబాద్: నగరంలోని ఓ సినిమా థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. షో ఆలస్యంగా వేయడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను మూసాపేటలోని ఏషియన్ లక్ష్మీకళ సినీ ప్రైడ్‌లో ప్రదర్శింపబడుతోంది.

అయితే, ఆదివారం సాయంత్రం ఫస్ట్(6 గంటలకు) షో కోసం టికెట్ కొని లోపలికి వెళ్లిన ప్రేక్షకులకు గంటన్నర అయినా కూడా సినిమా వేయకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. దీంతో థియేటర్ అద్ధాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

A theatre attacked by audience in Hyderabad

టికెట్ కొన్న ప్రేక్షకుల డబ్బులు తిరిగి ఇచ్చింది థియేటర్ యాజమాన్యం. దీంతో శాంతించిన ప్రేక్షకులు సినిమా చూడకుండానే నిరుత్సాహంతో థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే, సినిమా ప్రదర్శన ఆలస్యం కావడానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు.

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకన్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+