Hyderabad: మోమోస్ తిని మృతి చెందిన మహిళ..!

ఈ మధ్య హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వార సంతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా బస్తీల్లో అంగడీ సాగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సంత ఉంటుంది. ఈ సంతలో ప్రధానంగా కూరగాయలు లతో పాటు పలు రకాల సమాన్లు అమ్ముతారు. ఈ అండీలో సమోసాలు అమ్ముతారు, మిఠాయి అమ్ముతారు, మంచూరియా, మిర్చీ బజ్జీ ఇల రకరకాలుగా విక్రయిస్తుంటారు. తాజాగా సంతలో మోమోస్ ఓ మహిళ మృతి చెందింది. పది మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో జరిగింది.

అంగడిలో ఓ బండి వద్ద మోమోస్ తిన్న మహిళ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శుక్రవారం బంజారాహిల్స్ లోని నందినగర్, సింగాడిబస్తీ, గౌరీ శంకర్ కాలనీల్లో సంత జరిగింది. సంతలో కూరగాయలు కొనేందుకు చాలా మంది బస్తీ వాసులు వచ్చారు. సంతలో ఓ చోట మోమోస్ అమ్ముతున్నారు. ఇందులో సింగాడ కుంట బస్తీకి చెందిన రేష్మ బేగం, ఆమె పిల్లలు మోమోస్ తిన్నారు. డబ్బులు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

A woman died after eating momos in Nandinagar Hyderabad

వీరి లాగానే చాలా మంది అక్కడ మోమోస్ తిన్నారు. అక్కడ మోమోస్ తిన్న వారందరికీ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నుంచి విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా సమీపంలోని ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో మోమోస్ తినడం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అయితే ఈలోగా మోమోస్ తిన్న వారిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాదాపు 20 మంది ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఇందులో రేష్మ బేగం పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమెను నిమ్స్ కు తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది అయినా వైద్యులు వైద్యం అందిస్తున్న క్రమంలో రేష్మ బేగం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్పత్రి పాలైన వారిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మోమోస్ విక్రయించిన వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. వాటిని విక్రయించిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోమోస్ తో పాటు వాటిలోకి ఇచ్చే ఎగ్ మయోనీజ్, మిర్చి చట్నీల కారణంగా అస్వస్థతకు గురైనట్లు గా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+