బంజారాహిల్స్ రోడ్‌లో కలకలం: గోనె సంచిలో మహిళ మృతదేహం
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్‌పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గోనె సంచిని తెరిచారు.
ఆ సంచిలో సుమారు 60 ఏళ్ల మహిళ మృతదేహం ఉంది. ఆమె ఒంటిపై ఏమైనా గాయాలున్నాయా? అనే కోణంలో పోలీసులు పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ఎవరు ఇక్కడపడేశారనే విషయాన్ని తేల్చేపనిలో పడ్డారు పోలీసులు.

కాగా, ఆ సంచిలో లభించిన మహిళ మృతదేహం ఎవరిదనేది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసి ఇక్కడపడేశారా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాపూర్‌లో దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తిని వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు.
Recommended Video
మృతుడు కూలీపని చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కూలీపని చేస్తూ జీవిస్తున్న అతడ్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications