హైదరాబాద్ జూపార్క్‌: సింహం ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు, అలా బయటపడ్డాడు (వీడియో)

హైదరాబాద్: నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఏకంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అంతేగాక, సింహం ముందు దూకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన జూ సిబ్బంది ఆ యువకుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో సాయికుమార్ అనే యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌ దగ్గరవరకు వెళ్లాడు. అంతేగాక, సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎన్‌క్లోజర్‌లో అతన్ని చూసిన జనం భయంతో కేకలు వేశారు. వెంటనే అతడ్ని బయటికి రావాలని కోరారు.

A youth entered into lions enclosure in hyderabad zoo park

అయినప్పటికీ అతడు ఎన్‌క్లోజర్‌ నుంచి బయటకి రాలేదు. దీంతో కొందరు విజిటర్స్ జూ పార్క్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో జూ పార్క్ సిబ్బంది వచ్చి ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఆ యువకుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ఎన్‌క్లోజర్‌లో యువకుడు ఉన్న సమయంలో సింహం గాండ్రింపులతో అతడ్ని వేటాడేందుకు ప్రయత్నించింది. ఒకవేళ అతడు పెద్ద పెద్ద బండలపై నుంచి కిందికి దిగితే మాత్రం ఆ సింహానికి ఆహారమయ్యేవాడు. తృటిలో పెను విషాదం తప్పడంతో సందర్శకులతోపాటు జూ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

A youth entered into lions enclosure in hyderabad zoo park

సాయికుమార్ అనే ఆ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. అయితే, ఆ యువకుడికి మతిస్థిమితం సరిగ్గానే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. బహదూర్ పుర పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+