దీపికా పదుకొణేకు అస్వస్థత: హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అస్వస్థతకు గురైంది. 'ప్రాజెక్ట్ కే' షూటింగ్‌లో ఉన్న సమయంలో హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిందని.. ఈ క్రమంలో ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథనాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఈ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ సమయంలో దీపికా అస్వస్థతకు గురైందని.. హార్ట్ రేట్(గుండె స్పందన వేగం) విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆమెను హైదరాబాద్ నగరంలోని కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారని సమాచారం.
అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని సినీ వర్గాలు వెల్లడించాయి. అంతేగాక, షూటింగ్‌లో కూడా పాల్గొంటోందని తెలిపాయి. విశ్రాంతి లేకపోవడం వల్లే ఆమెకు ఇలా జరిగి ఉంటుందని వెల్లడించాయి. ఈ విషయంపై దీపికా ప్రతినిధులు లేదా మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.












Click it and Unblock the Notifications