అదానీపై నాగేశ్వర్ ట్వీట్.. మోడీ లక్ష్యంగా కేటీఆర్ ఫైర్, సంపద మొత్తం..
ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడో స్థానంలో నిలిచారు. 4 నెలల్లో ఆయన సంపద 4 లక్షల కోట్లు పెరగగా.. మేధావులు స్పందిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ట్వీట్ చేశారు. దేశం అభివృద్ధి చెందడం లేదని ఎవరూ అంటున్నారని కామెంట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా రీ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించిన రిపోర్ట్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. వారి తర్వాతి స్థానంలో అదానీ ఉన్నారు. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
I guess all of that ₹15 lakh that was promised to every poor Indian got deposited into only one account 😁
— KTR (@KTRTRS) August 31, 2022
Galti Se Mistake Modi Ji? https://t.co/aIuH8CbQ0k
అదానీ సంపద 10.9 లక్షల కోట్లు ఉండగా.. గత ఫిబ్రవరిలో ఆయన సంపద రూ.6.6 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. దేశం అభివృద్ధి చెందట్లేదని ఎవరన్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. ఆరు నెలల్లో గౌతమ్ అదానీ సంపద దాదాపు నాలుగు లక్షల కోట్లు పెరిగిందని నాగేశ్వర్ పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.

ప్రతి పేదవాడి అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోడీ ప్రామిస్ చేశారు. ఆ డబ్బంతా ఒక్క అకౌంట్‌లో డిపాజిట్ అయ్యిండొచ్చని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. గౌతమ్ అదానీ సంపద మాత్రం పెరిగిందని కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు స్పందించాల్సిం ఉంది.












Click it and Unblock the Notifications