ఇంజిన్ ఆఫ్: హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: ఎయిర్ ఏషియాకు చెందిన ఓ విమానం మంగళవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన i51543 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈ క్రమంలో 78 మంది ప్రయాణికులతో వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఛండీగఢ్-బెంగళూరు విమానంలో ఆ విమాన ప్రయాణికులను పంపించారు.

కాగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. తమ పైలట్లు, సిబ్బంది అనుభవం కలిగిన వారు కావడంతో ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చారని తెలిపింది.
తమకు ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని వెల్లడించింది. విమానంలో సమస్యకు కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, విమానంలో ఒక ఇంజిన్ ఆఫ్ అయినట్లు సమాచారం. ఇంధనం లీకేజీ అయినట్లు తెలిసింది. ఇది ఇలావుంటే, దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications