మీటర్లు పెడ్తారంటూ కేసీఆర్ చెప్పేవి అబద్ధాలే: రైతులతో అమిత్ షా క్లారిటీ

హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మునుగోడు సమరభేరి సభకు బయలు దేరారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన సభాస్థలికి చేరుకోనున్నారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.

కాగా, మునుగోడుకు బయలుదేరే ముందు అమిత్ షా రైతు సంఘాల నేతలతో బేగంపేట ఎయిర్ పోర్టులో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు.

 Amit shah meets farmers in hyderabad, give clarity on meters to motors.

బావుల దగ్గర మీటర్లు పెడ్తారని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమని, కేవలం డిస్కంల వద్ద మాత్రమే మీటర్లు పెడతామని అమిత్ షా స్పష్టం చేసినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధక బాధకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కాకపోవడంతో రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులను రైతులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు రైతులు. రైతాంగం సేంద్రీయ వ్యవసాయం దిశగా వెళ్లాలని కేంద్రమంత్రి సూచించినట్లు రైతుల సంఘాల నేతలు చెప్పారు. తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారని చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరామని రైతులు తెలిపారు.

కాగా, మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు 15 మంది కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయానికి ఆయన చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో అమిత్ షా మునుగోడుకు బయల్దేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+