బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన రద్దు.. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ..
హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రావడం లేదని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 17న ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయిందని పేర్కొన్నది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 17న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షాను ఆహ్వానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరులో జరిగే సభకు అమిత్ షా వస్తారని .. తొలుత బీజేపీ అధికారికంగా ప్రకటించింది. అయితే అదేరోజు ఢిల్లీలో బిజీగా ఉండటంతో పర్యటన రద్దయిందని తెలిపింది. ఆయన స్థానంలో మరో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం హవా కొనసాగుతుందని విమర్శించారు. మజ్లీస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనని విమర్శించారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని స్మరించుకోవాలని గుర్తుచేశారాయన. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ రోజున అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని పేర్కొన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications