Cable Bridge: అర్ధరాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై దారుణం..
దుర్గం చెరువుపై కట్టిన కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ కే మణిహారంగా నిలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, హైటెక్ సిటీతో పాటు కేబుల్ బ్రిడ్జి కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో కేబుల్ బ్రిడ్జి చూపిస్తున్నారు. అయితే చాలా మంది కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాడానికి వస్తుంటారు. సెల్ఫీలు తీసుకుంటారు. తాజాగా కేబుల్ బ్రిడ్జిపై దారుణం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ యువకులు మృతి చెందారు.
శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగేందుకు వచ్చారు. వారు ఫొటోలు దిగుతుండగా.. కారు అత్యంత వేగంగా వారి ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలిలోనే ఓ యువకుడు మృతి చెందింది. మరో యువకుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.

మృతుల్లో ఒకరిని అనిల్ గా గుర్తించారు. అతని వయస్సు 26 ఏళ్ల. మరో యువకుడిని గుర్తించాల్సి ఉంది. ఇద్దరు చనిపోవడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారును గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనను పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
నెల రోజుల క్రితం హైదరాబాద్ శివారులో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఆర్మీ ఉద్యోగి కునాల్ ను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కునాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం బొల్లారంలో కారు ఫుట్ పాత్ పై ఉన్న తోపూడు బండ్లపైకి దీసుకెళ్లింది. కారు నడిపిన వైద్యుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications