Chicken Fry: చికెన్ ఫ్రై చేయమంటే.. ఏకంగా హత్యే చేశాడు..!
చికెన్ ఫ్రై విషయంలో జరిగిన గొడవ ప్రాణాలు తీసింది. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహర్ కు చెందిన సుశీల్ గోస్వామి, ధీరజ్ మండల్ ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. వారు జీడిమెట్ల చౌదరిగూడలోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రంలో పని చేస్తున్నారు. వీరితో పాటు ఆ కేంద్రంలో బీహర్ కు చెందిన మరో ఇద్దరు సుజిత్ విజయ్ గోస్వామి, బాల కూడా ఉన్నారు.
వీరంతా కలిసి అప్పడప్పుడు పార్టీ చేసుకునే వారు. ఈ క్రమంలో జూన్ 4న రాత్రి పార్టీ చేసుకున్నారు. మద్యంతో పాటు స్టఫ్ కు కోసం చికెన్ ఫ్రే చేయాలని సుశీల్ గోస్వామని ధీరజ్ మండల్ కోరాడు. తను చికెన్ ఫ్రే చేయాలేనని సుశీల్ గోస్వామి తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ లొల్లి కాస్త ఘర్షణ వరకు వెళ్లింది. అయితే వారిద్దరిని సుజీత్, బాలా ఆపి పక్కకు తీసుకెళ్లారు. గొడవ సర్దుమనగడంతో వారు నిద్రపోయారు.

అయితే గోస్వామి మాత్రం ధీరజ్ అన్న మాటలకు తీవ్రంగా ఆగ్రహానికి లోనయ్యాడు. గతంలోనూ ధీరజ్ తనను అవమానించాడని గోస్వామికి గుర్తుకు వచ్చింది. రాత్రంతా ఆలోచింజిన గోస్వామి సోమవారం తెల్లవారుజామున ధీరజ్ మండల్ ను హత్య చేశాడు. సిమెంట్ ఇటుకతో తలపై మోది హత్య చేశాడు. ఆ వెంటనే పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. హత్య ఎలా జరిగిందో విచారించారు.
సిమెంట్ ఇటుకల తయారీ సంస్థ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుశీల్ గోస్వామి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా సుశీల్ ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడే సుశీల్ గోస్వామిని అరెస్ట్ చేశారు. ధీరజ్ మండల్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications