Hyderabad: పని ఉందని మహిళా కూలీని తీసుకెళ్లి అత్యాచారం..!
హైదరాబాద్ పలు చోట్ల కూలీల అడ్డా ఉంటుంది. ఇక్కడ పురుషులు, మహిళలు పని కోసం వేచి ఉంటారు. ఇళ్లు నిర్మించే బిల్డర్లు, అలాగే పలువురు ఏమైన పని ఉంటే వారితో మాట్లాడుకుని తీసుకెళ్తారు. కూలీలు పని ఉన్న చోటికి వెళ్లి పని చేసుకుని వస్తారు. తాజాగా ఓ మహిళా కూలీని పని ఉందని తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సోమవారం రాత్రి హైటెక్‌సిటీ క్రాస్ రోడ్‌లోని భవనంలో ఓ 50 సంవత్సరాల మహిళ కూలీ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. బస్సు కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చారు. బట్టలు ఉతికే పని ఉందని.. అందుకు రూ.500 ఇస్తామని చెప్పారు. రూ.500 వస్తే ఇంట్లో అవసరాలకు పనికొస్తాయని.. వెళ్లడానికి ఒప్పుకుంది. ఆమెను ముగ్గురు రూమ్ తీసుకెళ్లారు. లోపల బట్టలు ఉన్నాయి వెళ్లు అని చెప్పారు. దీంతో బాధితురాలు లోపలికి వెళ్లి బట్టలు ఉతికే పని ప్రారంభించింది.

ముగ్గురు యువకులు లోపలి నుంచి గడియ పెట్టుకుని ఆమెపై అత్యాచారం చేశారు. అయితే మహిళ కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితులు పారిపోయారు. బాధితురాలు వెంటనే మధురానగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులది ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ గా గుర్తించారు. వారు నెల క్రితమే రూమ్ అద్దె దిగినట్లుగా పోలీసులు తెలిపారు.
వారు స్థానికంగా పెయింటర్స్ గా పని చేస్తున్నట్లు విచారణలో తేలిందని వివరించారు. భవన యజమాని వద్ద నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. కాగా ఎవరికైనా ఇల్ల అద్దెకిచ్చే ముందు వారికి సంబంధించి ప్రాథమిక సమాచారం, ఆధార్ జిరాక్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications