Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: వివాహితకు మద్యం తాగించి లైంగిక దాడి.. ఆ తర్వాత వీడియోలతో బ్లాక్ మెయిల్..

మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ చౌకగా లభించడంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ సరైన దారిలో వాడితే మంచిదే కానీ.. చాలా మంది మొబైల్ ఫోన్లలో గేమ్ లు ఆడడం, ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండడం చేస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు ఏర్పడి ప్రేమగా మారుతున్నాయి. చివరికి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ గేమ్ లో పరిచయమైన వివాహతకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి లైంగిక దాడి చేశాడు.

ఈ ఘటన హైదరాబాద్ లోని మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన యువతికి ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు అదే రాష్ట్రానికి చెందిన వాసాకుమార్ నర్సింహమూర్తి, జాషువా అనే వ్యక్తులు పరిచమయ్యారు. జాషువా ఏపీలో గ్రామ వాలింటీర్ గా పని చేస్తున్నాడు. ఆమె జాషువాకు దగ్గరై 2020లో అతడిని పెళ్లి చేసుకుంది. అయినా నర్సింహమూర్తి ఆమెను వదలలేదు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. రోజు ఫోన్ చేస్తూ.. చాటింగ్ చేసేవాడు. దీంతో బాధితురాలికి జాషువా మధ్య గొడవలు జరిగాయి.

An incident where a married woman was drunk and took nude videos took place in Hyderabad

దీంతో బాధితురాలు హైదరాబాద్ లోని అమీర్ పేటలో తన స్నేహితురాలి వద్దకు వచ్చింది. విషయం తెలుసుకున్న నర్సింహమూర్తి ఆమె వద్దకు వెళ్లాడు. జాషువా విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రహ్మత్ నగర్ లో ఓ రూమ్ ను అద్దెకు తీసుకున్నాడు. బాధితురాలిని అక్కడకి పిలించాడు. ఆమెకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. అనతంరం ఆమెపై లైంగిక దాడి చేశారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

దీంతో సొంతూరు వెల్లిన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హైదరాబాదా మధురనగర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. మరో ఘటనలో మరిది వదినను హత్య చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం విశ్వకర్మకాలనీకి చెందిన సురేశ్‌, రేణుక 2016లో ప్రేమ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సురేష్ ఆటో డ్రైవర్ పని చేస్తున్నాడు. రేణుక రోజు కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగేది. ఇంటిని పట్టించుకునేది కాదు.

ఈ క్రమంలో రేణుకకు ఓ అనాథ బాలిక పరిచయమైంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన రేణక.. బాలికకు, భర్తకు రహస్యంగా పెళ్లి చేసింది. ఫిబ్రవరి 5న రేణుక, ఆ బాలిక సురేష్ ను హత్య చేశారు. రేణుక జైలు కు వెళ్లి ఈ మధ్యే బెయిల్ పై బయటకు వచ్చింది. ఆమె పగ పెంచుకున్న మరిది నరేష్ రేణుకు హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత మంగళవారం రాత్రి రేణకకు ఫోన్ చేసి రూ.200 కావాలని అడిగాడు. ఎందుకని ప్రశ్నించగా.. మందు తాగేందుకని బదులిచ్చాడు. దీంతో రేణుక తాను మద్యం తాగుతానని మరిది వద్దకు వద్దకు వచ్చింది. అప్పటికే అక్క సాయి, పద్మ, మరో బాలుడు మద్యం తాగుతున్నారు. ఇలా అందరు కలిసి మద్యం తాగారు. మిగతా నలురుగు కలిసి రేణుకను హత్య చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+