Cyber Crime: కస్టమర్ కేర్ నుంచి అంటూ ఫోన్.. రూ.1.2 లక్షలు కోల్పోయిన బాధితుడు..
ఈ మధ్య సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సైబర్ నేరాలు అంతా కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. అయితే కొందరు తెలియకుండా మోసపోతుంటే.. మరికొందరు అత్యాశకు పోయి డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వచ్చే జీతం సరిపోలేదని.. ఆన్ లైన్ పార్ట్ టైం జాబ్స్ కోసం సెర్చ్ చేసింది. సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు కూడా చూసేవారు.
ఇలా ఒక రోజు ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో తమ వద్ద పార్ట్ టైం ఉద్యోగం ఉంది. మీరు ఇష్టమొచ్చినప్పుడు పని చేయవచ్చు. ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని చెప్పాడు. తాము పంపే యూట్యూబ్ వీడియో లింక్ లు ఓపెన్ చేసి ఆ వీడియోలకు లైక్ కొట్టాలని చెప్పారు. ఒక్కో లైక్ కు రూ.50 చెల్లిస్తామని వివరించాడు. దీనికి ఆమె ఒకే చెప్పింది. దీంతో అతను కొన్ని యూట్యూబ్ వీడియో లింక్ లు పంపాడు. ఆమె లింక్ ఓపెన్ చేసి వీడియోలకు లైక్ కొట్టింది.

దీంతో ఆమెకు లైక్ లు కొట్టినందుకు వారు డబ్బులు పంపారు. ఇలా కొద్ది రోజులు వారు బాగానే డబ్బులు ఇచ్చారు. ఇదేదో బాగానే ఉదంకుని ఆమె వారిని నమ్మడం మొదలు పెట్టారు. దీంతో వారు తమ వద్ద పెట్టుబడి పెడితే డబుల్ ఇస్తామని చెప్పారు. దీంతో ఆమె కొంత మొత్తం లో డబ్బు పెట్టుబడి పెట్టారు. దీంతో వారు డబుల్ డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె భారీగా డబ్బు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేస్తే వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి కి ఫెడరల్ బ్యాంక్ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని నటిస్తూ ఫోన్ చేశాడు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచినట్లు తెలిపాడు. ఇది నిజమేనని నమ్మిన వృద్ధుడు అవతలి వ్యకి.. కేవైసీ వివరాలు ఇచ్చాడు. ఓటీపీ కూడా చెప్పాడు. దీంతో కాసేపటికే వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.1,22,350 విత్‌డ్రా అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications