నెహ్రూ జూ పార్క్‌లో విషాదం: ఏనుగు దాడిలో కేర్ టేకర్ మృతి

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏనుగు మావటి (కేర్ టేకర్)పై దాడి చేసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్(28) అనే మావటిపై ఓ ఏనుగు హఠాత్తుగా దాడి చేసింది.

సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదారుగురు మావటిలు విధుల్లో ఉంటారు. శనివారం జూపార్క్ 60 సంవత్సరాల వేడుక సందర్భంగా కొంత మంది అక్కడి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో షాబాజ్ ఒక్కరే విధుల్లో ఉన్నారు. అయితే, ఒక్కసారిగా ఏనుగు ముందుకు దూసుకొచ్చి అతడ్ని నేలకేసి కొట్టింది.

Animal caretaker died, after Elephant attacked on him, in Nehru Zoological park, Hyderabad

తీవ్రగాయాలపాలై కొనఊపిరితో ఉన్న బాధితుడిని అక్కడి సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే షాబాజ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. షాబాద్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఎల్బీ స్టేడియంలో పహిల్వాన్ల ఘర్షణ: పలువురికి గాయాలు

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎల్బీ స్టేడియంలో ఇద్దరు పహిల్వాన్ల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, గత మూడు రోజులుగా ఎల్బీ స్టేడియంలో మోదీ కేసరి దంగల్(కుస్తీ) పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో శుక్రవారం రాత్రి ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు కుర్చీలతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

Animal caretaker died, after Elephant attacked on him, in Nehru Zoological park, Hyderabad

పహిల్వాన్ల దాడులతో భయాందోళనలకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురి ప్రేక్షకులకూ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+