హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతనికి కరోనా నయమైంది, డిశ్చార్జ్ చేస్తాం: ఈటెల, తెలంగాణలో మరో 3 కొత్త ల్యాబ్‌లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి రెండుసార్లు చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని, కాబట్టి అతడిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కరోనా సోకితే చనిపోతారన్న ప్రచారం తప్పని దీంతో తేలిందన్నారు.

కరోనా రోగులకూ అదే చికిత్స..

కరోనా రోగులకూ అదే చికిత్స..

కరోనావైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు.
బుధవారం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సోకిన వారిలో కేవలం 14 శాతం మందికే చికిత్స అవసరమని చెప్పారు. గతంలో వైరల్ జ్వరాలు వచ్చిన వారికి అందించిన వైద్యమే కరోనా రోగులకూ అందిస్తున్నామని తెలిపారు. కరోనాకు త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాలేదని మంత్రి తెలిపారు.

తెలంగాణలో మరో మూడు ల్యాబ్‌లు

తెలంగాణలో మరో మూడు ల్యాబ్‌లు


దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి వస్తున్న వారి ద్వారా ఇక్కడికి కరోనా రాకుండా విమానాశ్రయాల్లోనే పరీక్షించి సరైన చికిత్స అందిస్తున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు. గతంలో గాంధీ ఆస్పత్రిలో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉందని, ఇప్పుడు ఉస్మానియాతోపాటు ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చిందని మంత్రి ఈటెల తెలిపారు.

Recommended Video

Coronavirus: WHO Declares COVID-19 A Global Pandemic | Oneindia Telugu
ఉమ్మడి 9 జిల్లాల్లోనూ..

ఉమ్మడి 9 జిల్లాల్లోనూ..


గురువారం నుంచి ఐదు ల్యాబ్‌ల్లో పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సుల్తాన్ బజార్, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రులతోపాటు 9 ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో కూడా కరోనా ఐసోలేటెడ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కరోనా రోగుల కోసం ఎఫ్ఆర్ ఫిల్టర్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఫలితంగా రోగులు వదిలిన గాలి శుద్ధి అవుతుందని ఈటెల తెలిపారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు.

English summary
another 3 labs in telangana: Etela Rajender on coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X