సిరిసిల్ల జిల్లా మరో గ్రామంలో లాక్‌డౌన్.. వరంగల్, మెట్‌పల్లిలో నో...?

ఒమిక్రాన్ వైరస్ హడలెత్తిస్తోంది. కేసులు చాపకింద నీరులా వెలుగులోకి వస్తున్నాయి. ట్రావెల్ బ్యాన్ లేకపోవడంతో.. అంతా స్వగ్రామాలు/ పట్టణాలకు చేరుకుంటున్నారు. దీంతో కేసులు బయటపడుతున్నాయి. అయితే తొలుత హైదరాబాద్‌లోనే రాగా.. తర్వాత వరంగల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కూడా కేసు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల గ్రామంలో మాత్రం స్వయంగా లాక్ డౌన్ విధించుకున్నారు. మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరో గ్రామంలో

మరో గ్రామంలో

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురం గ్రామస్థులు తీర్మానం చేసుకున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు రెండు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించుకున్నారు.

రెండు రోజులు

రెండు రోజులు

రెండు రోజులు గ్రామంలోని అన్ని రకాల దుకాణాలు మూసి వేయడానికి తీర్మానించుకున్నారు. కిరాణా షాపులకు మాత్రం ఉదయం 10 గుంటల వరకు మరియు సాయంత్రం 6 గంటలు నుండి 8 గంటలు వరకు మినహాయింపు ఇచ్చారు. నారాయణపురంకు చెందిన గల్ఫ్ కార్మికుడికి ఒమిక్రాన్ రావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు

మొత్తం 4 కేసులు

మొత్తం 4 కేసులు

రాజన్న సిరిసిల్లలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చింది. దీంతో అతనిని టిమ్స్‌కు తరలించారు. అయితే అతని భార్య, అతని తల్లి, స్నేహితుడికి కూడా వచ్చింది. వారిని కూడా టిమ్స్ తరలించారు. వారి కాంటాక్టులను గుర్తించి.. వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ మూడు కేసులతో జిల్లాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

ఆ రెండు చోట్ల

ఆ రెండు చోట్ల

సిరిసిల్లలో రెండు గ్రామాలు ఓకే.. మరీ కేసులు ఎక్కువగా వచ్చిన హైదరాబాద్ సంగతి ఏంటీ.. ఆయా చోట్ల ఆంక్షలు విధిస్తే బాగుండేది. తొలుత టోలిచౌకీ కంటైన్మెంట్ జోన్ చేశారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలను మాత్రం అలా చేయలేదు. తర్వాత వచ్చిన వరంగల్ గురించి కూడా లాక్ డౌన్ అని.. కంటైన్మెంట్ జోన్ అని మాత్రం చేయలేదు. ఇటీవల వచ్చిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కూడా అలాంటి పరిస్థితి లేదు. చావిడి ప్రాంతంలో లాక్ డౌన్ విధించిన సరిపోయేది. లేదంటే వైరస్ కేసులు మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+