Hyderabad: ఏపీకి క్యూ కడుతున్న ఓటర్లు.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ కు ఖాళీ అవుతోంది. ఏపీకి చెందిన ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్తోన్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏపీ ఓటర్లు సొంతూళ్ల బాట పట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కొక్కరిగా బయల్దేరారు. శనివారం భారీగా వెళ్తోన్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతోన్నాయి. చాలా మంది సొంత వాహనాల్లో ఏపీకి బయల్దేరారు.
దీంతో నగర శివారల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేటవుతుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు విజయవాడ రూట్ లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ కొనసాగుతోంది. బస్సులు దొరక్క పోవడంతో చాలా మంది సొంత వాహనాల్లో వెళ్తోన్నారు.

దాదాపు ఏపీకి చెందిన 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉన్నారు. వీరంతా సొంతూళ్లకు వెళ్తే హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఏపీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను సొంతూళ్లకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పలు ట్రావెల్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఓటర్లు ప్రయాణమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మే 13 ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇటు తెలంగాణలో కేవలం లోక్ సభకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో గతేడాది నవంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications