Hyderabad: అందుబాటులోకి రానున్న 4.04 కిలోమీటర్ల ఫ్లై ఓవర్..!
హైదరాబాద్ వాసులకు మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆరామ్‌ఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ను త్వరలో ప్రారంభించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయింది. చిన్న చిన్న పనులు పూర్తి డిసెంబర్ 3, 2024న ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తాజాగా దీన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఫ్లై ఓవర్ ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా తేదీ ప్రకటించ లేదు. ఈ ఫ్లైఓవర్ 4.04 కిలోమీటర్లు విస్తరించి ఉంది.
ఇది హైదరాబాద్‌లో రెండవ పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రాబోయే వారాల్లో జరిగే అవకాశం ఉంది. ఆరు-లేన్లుగా నిర్మాణం చేపట్టారు. ఇది ఆరామ్‌ఘర్‌ను నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో కలుపుతుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.

ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆరామ్ఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివరాంపల్లి, హసన్నగర్ వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతోన్నాయి. హైదరాబాద్ లో ఇంకా చాలా చోట్ల ఫ్లై ఓవర్లు రావాల్సిన అవసరం ఉంది. అంబర్ పేట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే రామంతపూర్, అంబర్ పేట, గోల్నాక, ఛే నంబర్, కాచిగూడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.












Click it and Unblock the Notifications